ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది: చంద్రబాబు

SMTV Desk 2017-11-17 17:05:55  chandrababu naidu, Bill Gates, visakhapatnam, Aggregate Sammit Conference

విశాఖపట్టణం, నవంబర్ 17: విశాఖపట్టణంలో అంతర్జాతీయ అగ్రిగేట్ సమ్మిట్ సదస్సులో బాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలిగేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... " ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. బిలిగేట్స్ విశాఖపట్టణ౦కు రావడం ఆనందంగా ఉంది. గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్‌ కంపెనీని బిలిగేట్స్ తీసుకొచ్చారు. బిల్‌గేట్స్ త‌న సంపాదనలో ఎక్కువ సమాజం కోసం, తక్కువ వారసుల కోసం కేటాయించారు. విశాఖపట్టణ౦ అందమైన, స్వచ్ఛమైన నగరం అని, పెట్టుబడులకు కూడా ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని బిలిగేట్స్ అన్నారు" అని హర్ష భావం వ్యక్తం చేశారు.