మానసిక వికలాంగులు అని కూడా చూడకుండా...

SMTV Desk 2017-11-16 14:35:00  sexual harassment, fiscally handy caped girls, krishna district.

కృష్ణాజిల్లా, నవంబర్ 16 : ఇద్దరు మానసిక వికలా౦గురాళ్ళపై ఓ కామాంధుడు కన్నేశాడు. వారిరువురిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కృష్ణా జిల్లా గంపలగూడెంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. రెండు వేర్వేరు కుటుంబాలలో.. ఒక ఇంట అంధురాలు (16).. మరో ఇంట మానసిక వికలా౦గురాలు (15) ఉన్నారు. వీరిద్దరి ఇళ్లు పక్క పక్కనే కావడంతో మంచి స్నేహితులయ్యారు. ఒకరికి మరొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఈ క్రమంలో వీరి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళారు. ఇదే అదునుగా భావించిన కామాంధుడు వీరిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. మానసిక వికలాంగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై అదే గ్రామానికి చెందిన గొర్రుముచ్చు గోపి అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు.. నిందితుడిపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.