నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న వర్సిటీ

SMTV Desk 2017-06-09 19:39:09  Andhra Pradesh,SRM Versity,MIT,Singapore,UK

అమరావతి, జూన్ 9: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొత్తగా ఏర్పాటయ్యే ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో క్యాల్యుక్లస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, క్లాసికాల్ మెకానిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో పాటు అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎస్ ఆర్ ఎం వర్సిటి అమరావతి ప్రెసిడెంట్ డాక్టర్ పి. సత్యనారాయణన్ గురువారం రోజున ప్రకటించారు. ఈ కోర్సులను ప్రభావవంతంగా అందించేందుకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎం ఐటీ) తో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. ఎస్ ఆర్ ఎం వర్సిటీ ప్రస్తుతం యూఎస్, యూకే, సింగపూర్ కి చెందిన అంతర్జాతీయ వర్సిటీలతో భాగస్వామ్యం కలిగి ఉందని ఎస్ ఆర్ ఎం వర్సిటి అమరావతి వీసీ డాక్టర్ నారాయణ రావు తెలిపారు. ఈ వర్సిటీల మద్దతుతో రెన్యుబుల్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ , బ్లూ ఎకానమీ, నానో టెక్నాలజీస్ తొ పటు అనేక రంగాలపై తమ వర్సీటీ దృష్టి సారించబోతుందని ఆయన వివరించారు.