ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు గాజుల అలంకరణ

SMTV Desk 2017-10-21 17:46:51  Indrakiladri, dhurgamma, bangles decoration

విజయవాడ, అక్టోబర్ 21 : విజయవాడ కనకదుర్గమ్మ గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు పెద్ద ముతైధువుగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. మూలవిరాట్టుతో పాటు మహా మండపం ఆరో అంతస్తులోను అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గాజులు అలంకరించారు. అలాగే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున నది స్నానాలాచరించి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది.