గోదావరిలో కార్తీక స్నానాలు

SMTV Desk 2017-10-20 16:01:26   East godavari, Karthi month, Karthika baths in Godavari

తూర్పుగోదావరి, అక్టోబర్ 20 : దేశమంతటా గురువారం దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కాగా శుక్రవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రవహిస్తున్న గోదావరి నదిలో భక్తులు తెల్లవారుజాము నుంచే కార్తీక స్నానాలు ఆచరించి, అనంతరం పూజలు నిర్వహించారు. ఈ పుణ్య స్నానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.