తూ. గో. జిల్లా టిడిపి అధ్యక్షుడు ఇంట్లో దారుణం...

SMTV Desk 2017-10-17 18:00:36  east godavari, tdp, ramachandrapuram, murder

తూర్పు గోదావరి, అక్టోబర్ 17: తూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన హత్య ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రామచంద్రాపురం పట్టణ టిడిపి అధ్యక్షుడు నదుల రాజు కుమార్తె దీపికను కొందరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. నిన్న రాత్రి నదుల రాజు తన కుమారుడితో కలిసి బయటకు వెళ్లి పనులు అన్ని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి తన కుమార్తె రక్తపు మడుగులో పడిపోయి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.