తమిళనాడులో రోడ్డు ప్రమాదం ఐదుగురు తెలుగు వాసులు మృతి

SMTV Desk 2017-09-16 13:14:31  Tirunelveli in Tamil Nadu, Road accident,Guntur

గుంటూరు, సెప్టెంబర్ 16 : తమిళనాడులోని తిరునెల్వేలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులను పొన్నూరు మండలం కొల్లూరు వాసులుగా గుర్తించారు. కాగా, గాయపడిన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగి ఉన్న బస్సును సిమెంట్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిరునెల్వేలి కలెక్టర్ స్పందిస్తూ. గుంటూరు కలెక్టర్ కోన శశిధర్ తో చరవాణి ద్వార సంప్రదించి , ప్రమాద వివరాలు తెలుసుకుని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని.. మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు చేయాలని కోరారు.