పోలవరం నిర్మాణానికి ఆయనే స్పూర్తి: చంద్రబాబు

SMTV Desk 2017-09-15 17:47:37  AP Chief Minister, Chandrabau naidu, M. Visvesvaraya, Engineers day

అమరావతి, సెప్టెంబర్ 15: నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుతొ పాటు నదులను అనుసంధానం చేసే ప్రక్రియలు విశ్వేశ్వరయ్య స్ఫూర్తితోనే ముందుకు తీసుకెళ్ళామని అన్నారు. బ్రిటీష్ పాలకులు ఆయన కార్యదీక్షను ఆనాడే గుర్తించి, సింధు రాష్ట్రంలోని అతిపెద్ద బ్యారేజ్ నిర్మాణానికి ప్రత్యేక ఇంజినీర్‌గా ఆయనకు పట్టంకట్టారని కొనియాడారు. మోక్షగుండం రోజుకు 18 గంటలు పనిచేసే వారని, 90ఏళ్ల వయసులో కూడా ఆయన సలహాలు ప్రభుత్వాలకు ఎంతో మార్గదర్శకంగా నిలిచాయన్నారు. పదిమంది కోసం ఆలోచించే వాడే నాయకుడని, పది తరాలకు మేలు చేసే పనులు చేపట్టేవాడు దార్శనికుడని, మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి వారె దార్శనికులేనని సీఎం వెల్లడించారు.