రోజాపై పోటీ చేయడానికే నేను టీడీపీ లోకి రాలేదు..!

SMTV Desk 2017-09-14 11:00:47  Vani Viswanath, YCP MLA Roja, TDP , Vani Viswanath Politics entry

చెన్నై, సెప్టెంబర్ 14: టాలీవుడ్‌.. మాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన గ్లామ‌ర‌స్ హీరోయిన్‌.. మాలీవుడ్ జూలియారాబ‌ర్ట్స్ గా పేరున్న ప్ర‌ముఖ న‌టి వాణీ విశ్వ‌నాథ్ తెదేపా తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మీడియా ప్రతినిధులు ఆమెను పలకరించగా పలు విషయాలపై స్పష్టతనిచ్చారు. వైకాపా ఎమ్మెల్యే, నటి రోజాకు మీరు పోటీగా నిలవబోతున్నారా? అని ప్రశ్నించగా ఆమె తనదైన శైళిలో బదులిచ్చారు. చంద్రబాబు నాయకత్వం, పార్టీ సిద్ధాంతాలు నచ్చాయి కనుక పార్టీలోకి వచ్చానని చెప్పారు. ఇక నా ప్రత్యర్థి ఎవరు ఉన్న బరిలో నిలుస్తా, సరైన ప్రత్యర్థి ఉంటేనే థ్రిల్ గా ఉంటుందని చెప్పారు. మరో ప్రశ్నకు బదులుగా తనను చిత్ర పరిశ్రమలో తెలుగు ప్రజలే మొదటగా ఆదరించారని, వారి రుణం తీర్చుకోవడానికి ఇక్కడి నుండి రాజకీయ అరగేట్రం చేస్తున్నట్లు తెలిపారు. కాగా, చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశకత్వంలో నడవటానికి చాలా ఆసక్తిగా ఉందని తెలిపిన ఆమె భారత్‌లో గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడని అభివర్ణించారు.