సినీ నటుడు వేణు మాధవ్ తో సీఎం చంద్రబాబు భేటీ

SMTV Desk 2017-09-13 13:07:47  Film comedyyan Venu Madhav,Meet with CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 13 : సినీ కామెడీయన్ వేణు మాధవ్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో, పాల్గొంటూ విషయం తెలిసిందే... రానున్న ఎన్నికలకు టీడీపీలో పూర్తి స్థాయి ప్రచారంలో చేసి రాజకీయ నాయకుడిగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబుతో భేటీ కానున్న వేణు మాధవ్, తాను చేయాల్సిన పనులు, తనపై పెట్టే బాధ్యతల గురించి మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో సినీ ప్రముఖులను కూడా భాగం చేయాలని చంద్రబాబు భావిస్తుండగా, అందుకు తొలి అడుగుగా, వేణు మాధవ్ రావడం విశేషం... ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో పర్యటిస్తారని సమాచారం. అలాగే వేణు మాధవ్ చెప్పే సూచనలపై కూడా సీఎం చంద్రబాబు మంచిగా స్పందిస్తున్నట్లు పార్తీ వర్గాలు వెల్లడించాయి.