క్రికెట్ బెట్టింగ్ కేసులో అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేతల కోసం గాలింపు

SMTV Desk 2017-09-12 11:20:55  Nellore, Cricket Betting, TDP MLA, YSRCP MLA

నెల్లూరు, సెప్టెంబర్ 12: నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఏపీలో పెను దుమారం లేపింది. దీనికి ప్రధాన కారణం ఈ వ్యవహారంలో ఇటు అధికార, అటు ప్రతిపక్ష నేతలకు భాగం ఉండటమే అనే విషయం స్పష్టమయింది. అయితే ఇప్పటీకే ఈ కేసులో నిందితులైన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాగా, ఇదే కేసులో నిందితులుగా ఉండి అజ్ఞాతంలోకి వెళ్లిన టీడీపీ నేత శరత్ చంద్ర, ఆయన కుమారుడైన సుభాష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. టీడీపీ నేతలు పట్టుబడితే, ఈ కేసు మరింత కొలిక్కిరావచ్చనే అభిప్రాయాన్ని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే నిందితులైన తొమ్మిది మందికి సంబంధించిన అక్రమ ఆస్తుల స్వాధీనం పరచుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.