ప్రజా సంక్షేమమే తెలుగు దేశం ధ్యేయం: ముఖ్య మంత్రి చంద్రబాబు

SMTV Desk 2017-09-11 13:44:15  AP CM Chandrababu naidu, srikakulam, door to door tdp , tour

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11 : ప్రజల సమస్యలను పరిష్కరించడం లో భాగంగా ఇంటింటికి తెదేపా కార్యక్రమాన్ని తెలుగు దేశం పార్టీ చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం వీరఘట్టం మండలం తెట్టంగి పర్యటనకు వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ,అనంతరం స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి తిరిగారు. సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు. ప్రజలు కూడా వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ గ్రామం మొత్తం కార్య కర్తల హడావుడి తో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లే కనిపించాయి. ఇంటింటికి తెదేపా కార్య క్రమం రాష్ట్ర మంతా జరుగుతోంది.