విజయనగరంలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ నియామకాలు

SMTV Desk 2017-09-09 14:12:47  Air Force, Air Men Jobs, vijayawada, Indira Gandhi Stage

విజయవాడ, సెప్టెంబర్ 09 : విజయవాడలో ఎయిర్ ఫోర్స్, ఎయిర్ మెన్ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. నెల్లూరు, విశాఖ, విజయనగరం జిల్లాలతోపాటు యానం నుంచి వచ్చిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం ఇందిరాగాంధీ స్టేడీయం పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేడీయం వద్ద బందర్ రోడ్డుపై ట్రాఫిక్ మళ్లించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో తొలిసారి జరుగుతున్న ఈ ఎయిర్ ఫోర్స్ నియామకాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. ఈ నెల 11న ఉభయ గోదావరి, గుంటూరు,కృష్ణాజిల్లాల అభ్యర్థులకు నియామక పరీక్షలు నిర్వహిస్తారు.