కొలీగ్ బైక్ ఎక్కిందన్న కోపంతో భార్యను హతమార్చిన భర్త..

SMTV Desk 2017-09-08 18:34:04  vijayanagaram, kottam,

విజయనగరం, సెప్టెంబర్ 8: విజయనగరం జిల్లాలో కొట్టాం సమీపంలో ఓ దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ మహిళను తన భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసుల కథనాల ప్రకారం..." కొట్టాం జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల‌లో ఉమాదేవి అనే ఉపాధ్యాయురాలు రోజు లాగే స్కూల్ కి వెళ్లి తిరిగి స‌హ‌చ‌ర ఉపాధ్యాయుడి బైక్‌పై త‌న‌ ఇంటి వైపు వెళ్తుండగా, ఆమె ఇత‌ర వ్యక్తితో వ‌స్తుండ‌గా చూసి ఆగ్రహం తెచ్చుకున్న ఆమె భ‌ర్త కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడని, అతడిపై కేసు నమోదు చేశామని" పోలీసులు వెల్లడించారు.