గెలుపు పై లోకేష్ ధీమా

SMTV Desk 2017-09-08 15:29:56  nara lokesh, lokesh statement, lokesh 175 seats, 2019 electins lokesh comments, tdp lokesh

విజయవాడ, సెప్టెంబరు 08 : రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ 175 స్థానాలు గెలుచుకుంటుందని పులివెందుల లో కూడా తమదే గెలుపని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించడం మితి మీరిన ఆత్మ విశ్వాసమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నంద్యాల అసెంబ్లీ సీటు గెల్చుకోవడం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకోవడంతో లోకేష్ ఇలా మాట్లాడే ఉంటారని భావిస్తున్నారు. ఇల్లు అలక గానే పండగ కాదని లోకేష్ తెలుసు కోవాలని అన్నారు. విజయవాడ లో జరిగిన ఓ కార్య క్రమం లో లోకేష్ మాట్లాడుతూ పులివెందుల లో కూడా తమదే విజయమనడం కేవలం కార్య కర్తలను ఉత్తేజ పరచాడని కే నని,నంద్యాల లో తెలుగు దేశం గెలుపు జగన్ పై వ్యతిరేకత కాదని, స్థానికంగా ఉన్న అసంతృప్తి కారణమని ఈ విషయం లోకేష్ తెలుసుకోవాలని పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రా లో ముఖ్య మంత్రి చంద్ర బాబు చాలా అభివృద్ధి కార్య క్రమాలకు శ్రీ కారం చుట్టినప్పటికి సామాన్యులకు అవి అందే క్రమం లో బాగా అలస్యమవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.