చంద్రబాబు ఇంటి వద్ద కలకలం.. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన కేశవరెడ్డి బాధితుడు...!!

SMTV Desk 2017-09-08 13:50:35  keshava reddy, keshava reddy crime, chandhrababu keshavareddy, ap news, keshavareddy breaking news

అమరావతి సెప్టెంబర్ 8: కేశవరెడ్డి విద్య సంస్థలు విద్యార్థుల తల్లి దండ్రులచే లక్షల రూపాయలు డిపాజిట్ రూపాన రాబట్టి ఆ విద్య సంస్థల అధినేత కొన్ని కోట్ల రూపాయలు రాబట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం బట్టబయలు అవడంతో పోలీసులు అప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్నా, ఆ తర్వాత ప్రభుత్వ అండదండలతో కేశవరెడ్డి బయటకి వచ్చినా, బాధితులకు మాత్రం ఆయన పూర్తిగా న్యాయం చేయలేదు. అయితే ఈ బాధితుల్లో ఒకరు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఇంటి వద్ద ఆత్మహత్యా ప్రయత్నం చేయడం పెద్ద కలకలాన్నే రేపింది. ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు గంగుల శ్రీనివాసరెడ్డి. 10 రోజులైనా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ లభించకపోవడంతో.. సీఎం నివాసం ఎదుట బలవన్మరణానికి యత్నించాడు. 2012 లో కేశవరెడ్డి కి ఐదు లక్షలు అప్పుగా ఇచ్చానని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఆయన నిరాకరించడంతో, తన బిడ్డ ఆపరేషన్ నిమిత్తం డబ్బులు అవసరం అవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టానని శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు. అయితే విషయం తెలిసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుడిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.