175 స్థానాలలో మేమే గెలుస్తాం: మంత్రి నారా లోకేష్

SMTV Desk 2017-09-08 13:07:39  vijayawada, cabinet minister nara lokesh, bhavanipuram, telugudesham,

విజయవాడ, సెప్టెంబర్ 8: విజయవాడలో భవానిపురంలో వాటర్ వర్క్స్ దగ్గర జలసిరి హారతి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..."రాయల సీమను రతనాల సీమ గా మారుస్తామని, పట్టిసీమకు దండగైన ఏకైక వ్యక్తి జగన్ అని తెలిపారు. రెండు ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తూన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ను ప్రజలు నిలదియాలని, ప్రస్తుతం ఉన్న 175 స్థానాలలో తెలుగుదేశం గెలుస్తుంది. పులివెందుల లో కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.