చింతలపూడి ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు శంకుస్థాపన

SMTV Desk 2017-09-07 16:51:14  krishna, andhrapradesh, chinthalapudi, reddy gudem, ap cm chandrababunaidu, ap cm

కృష్ణా, సెప్టెంబర్ 7: కృష్ణా జిల్లా రెడ్డి గూడెం మండలం, మద్దుల పర్వలో చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు భూమి పూజ నిర్వహించారు, అదేవిధంగా పైలాన్ ను కూడా ఆవిష్కరించారు. 3,200 కోట్ల ఖర్చుతో కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే ల‌క్ష్యంగా ఈ పనులను ప్రారంబించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ..." మీలో ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడ‌లేదని, దీన్ని ఎప్పటికి మ‌ర్చిపోలేనని కృష్ణాజిల్లా ప్రజలను ఉద్దేశించి అన్నారు. అంతేకాదు ప్రకృతి లో భాగంగా చెట్లను, నీరును, కాపాడుకోవాల్సిన భాద్యత మనందరిదని, ఒకప్పుడు నీటి సమస్య లేదు కానీ ఇప్పుడు భూగర్బ జలాలు ఇంకిపోతున్నాయి, అతివృష్టి, అనావృష్టి ప‌రిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే అంద‌రూ ప్రకృతిని ఆరాధించాలని తెలిపారు. మన దేశంలో మొత్తం 12 నదులు ఉంటె ఒక్కో నదికి ఒక్కో సవంత్సరం పుష్కరాలు నిర్వహిస్తున్నాము. మన సాంప్రదాయాలు అచరిస్తూ వస్తున్నాం అదేవిదంగా అన్ని పండుగల కంటే మిన్నగా జలసిరి హారతి కి పిలుపునిచ్చాను. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని" అయన పేర్కొన్నారు.