ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదు: బాలకృష్ణ

SMTV Desk 2017-09-07 12:37:02  hyderabad, telugudesham party, andrapradesh, hindhupuram, cm,

హైదరాబాద్, సెప్టెంబర్ 7: విలక్షణ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలనో, మంత్రి కావాలనో ఎటువంటి ఆశలూ లేవని, పెద్ద పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, తన తండ్రి పోటీ చేసి గెలిచిన హిందూపురాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని స్పష్టం చేశారు. ఇక్కడున్న సమస్యల్లో కొన్ని తన దృష్టికి వచ్చాయని, ఇక్కడి ప్రజల ప్రతినిధిగా వాటిని పరిష్కరించడమే తన ముందున్న తొలి కర్తవ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా వెన్నంటి ఉంటానని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాను, అంతేకాని ముఖ్యమంత్రి పదవి ఎన్నడూ కోరుకోలేదని తెలిపారు.