అనిశా కు చిక్కిన మరో అవినీతి చేప..!

SMTV Desk 2017-09-06 16:04:48  vishakapatnam, achyuthapuram,

విశాఖపట్టణం, సెప్టెంబర్ 6: అచ్యుతాపురం ఏపి ఈపీడిసీఎల్ ఏఈ రంగారావు జనవరి 31 వ తేదిన సర్వీస్ కనెక్షన్ ఇచ్చేందుకు 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఏఈ రంగారావు ఆస్తులపై ఏసీబీ దాడులు చేశారు. విశాఖలో రెండు చోట్ల వారి అత్తా గారి ఇల్లు అయిన ప. గో. ఆచంటలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు విశాఖలో రెండు ఫ్లాట్లు, అచ్యుతాపురంలో 60 సెంట్ల భూమి, మురళినగర్ లో ఓ అపార్ట్ మెంట్, ఫ్లాట్, కైకలూరు వెంకటాపురంలో 10 సెంట్ల రెసిడెన్షల్ సైట్, 7 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 5 లక్షల వరకు గృహోపకరణాలు, ఒక కారు ను గుర్తించారు. కోటి రూపాయల వరకు రంగారావు ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన ఏసీబీ, వాటి విలువ బహిరంగ మార్కెట్ లో 3 కోట్లు ఉంటుందని తెలిపారు.