శాసనమండలి చైర్మన్ గా ఫరూక్

SMTV Desk 2017-09-04 15:29:24  Nandi, Kakinada Selection, TDP victory, MLC Farooq ap cm chadrababu

విజయవాడ, సెప్టెంబర్ 4 : నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేలా కృషి చేసిన ఎమ్మెల్సీ ఫరూక్ మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్ లో సెంటర్ ఫర్ లీడర్ షిఫ్ ఎక్స్ లెన్స్ పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. ఈ తరహా విజయాలను అన్ని నియోజకవర్గాలకు వ్యాపింపజేసే నిమిత్తం చంద్రబాబు అధ్యక్షతన ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గా ఫరూక్ పేరును ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సహచర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జయాపజయాలు ఎప్పుడూ ప్రభావం చూపిస్తాయని, సాంకేతికతను అనుకూలంగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు.