విద్యార్థి పై టీచర్ దాష్టికం...

SMTV Desk 2017-09-02 12:15:35  anathapuram, veerapuram, teacher harrased on student,

అనంతపురం, సెప్టెంబర్ 2: అనంతపురం జిల్లాలో గుమ్మఘట్ట మండలంలో వీరాపురం గ్రామానికి చెందిన గోవిందరాజులు తన కుమారుడు అయిన లోకేష్ సాయిను రాయి దుర్గ పట్టణంలోని సెయింట్ థామస్ స్కూల్లో ఈ ఏడాది ఎనిమిదవ తరగతిలో చేర్చాడు. అదే స్కూల్ లో చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు లోకేష్ సాయి ని ర్యాగింగ్ చేస్తూ వేదింపులకు గురి చేశారు. ఈ విషయాన్నీ లోకేష్ సాయి స్కూల్ ప్రిన్సిపాల్ కు చెప్పిన లాభం లేకపోయింది. ఇంతటితో ఆ ముగ్గురు విద్యార్ధులు ఆగలేదు, సోషల్ టీచర్ అయిన వెంకటస్వామి తో లోకేష్ మీద ఉన్నవి లేనివి చెప్పారు. దీంతో నిజ నిజాలు తెలుసుకోకుండా టీచర్ వెంకటస్వామి లోకేష్ సాయి ను తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనతో లోకేష్ సాయి బయపడి స్కూల్ కి వెళ్ళడం మానేశాడు, లోకేష్ ఆరోగ్యం దెబ్బతినడంతో తన తల్లి తండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా మెడ నరాలు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. అసలు విషయం తెలిసిన లోకేష్ తల్లి తండ్రులు స్కూల్ మేనేజ్ మెంట్ పై దాడికి దిగారు. విద్యార్ధి తల్లి తండ్రులు టీచర్ వెంకటస్వామి పై పోలీసులకు పిర్యాదు చేశారు.