మీరు టీ తాగుతున్నారా..? విషం తాగుతున్నారా..?

SMTV Desk 2017-09-02 12:03:14  

ప్రతి రోజు మనం తీసుకునే ఆహారం, పాలు, నీళ్లు, పండ్లు అన్నీ పక్కా ఒరిజనలా..? లేక కల్తీయా..? ఒక్క సారి ఆలోచించరా..? ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు కల్తీ మయం అయిపోయింది. కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరుగా సాగుతుంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్న చందంగా వ్యాపారం సాగుతోందంటే నమ్మండి. ఇప్పుడు ఈ కల్తీ వైరస్ టీ పొడికి కూడా చేరింది. నాసిరకం టీ పొడికి రంగులు హద్దుతూ నాణ్యమైన టీ పొడిగా దాన్ని విక్రయిస్తున్న వ్యాపారీ బండారం బయటపడింది. విశాఖపట్నం లోని అల్లీపురం సమీపం లోని వెంకటేశ్వర మెట్ట వీధిలో ఓ పాడుబడిన భవంతిలో అసోం రాష్ట్రానికి చెందిన బి. విజయ్ సింగ్ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నాడు. అయితే ప్రమాదకర రంగు రంగుల రసాయనాలను టీ పౌడర్ లో కలుపుతూ వాటికి నాణ్యమైన బ్రాండ్ లోగోలు వేసి మరీ వాటిని విక్రయిస్తున్నాడు. అయితే గిరిజన ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా అమ్మడంతో అక్కడి ప్రజలకు ఈ ప్యాకెట్ల పై అనుమానం రాలేదు. కానీ స్థానికులు ఈ విషయాన్ని గమనించడంతో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.