జగన్ చేసిన సహాయం మీకు తెలుసా ?

SMTV Desk 2019-11-12 14:37:11  

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ళ శశిధర్ కు భరోసా ఇచ్చారు. విజయవాడ కి చెందిన ఎం. శశిధర్ కొన్ని రోజుల నుండి జ్వరం తో బాధపడుతున్నారు. అయితే అది డెంగీ అని అది కాస్త మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. అయితే ఈ ఆపరేషన్ కు దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. కూలిపని చేసుకొనే బ్రతికే వారికీ అంత డబ్బు అంటే చాల కష్టమనే చెప్పాలి. అయితే తల్లిదండ్రులు శశిధర్ ని కాపాడుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

ఈ విషయం పై పలు కథనాలు రావడం తో వీటిని చదివిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అయితే బాలుడికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వెంటనే బాలుడికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుండి అధికారులు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి శశిధర్ వైద్య ఖర్చుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తామని అయితే శశిధర్ వైద్యానికి సంబందించిన కాగితాలను తీసుకు రావాలని సూచించారు. అయితే ఈ విషయం లో ముఖ్యమంత్రే స్వయంగా స్పందించడం తో శశిధర్ తాళ్లూరి దండ్రులు, విద్యార్థులు. స్కూల్ యాజమాన్యం అంతా హర్షం వ్యక్తం చేసారు. ఈ విషయం తో జగన్ మరొకసారి ప్రజల నాయకుడు అని అంతా భావిస్తున్నారు.