జగన్ కి అడ్డొస్తే మర్డర్ చేసి జైలుకెళ్లా…

SMTV Desk 2019-10-18 16:44:26  

జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనుల పై ఒక పక్క పొగుడుతూనే, ప్రతి పక్షాలను విమర్శిస్తోంది. శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించి సంచలనం అయిన సంగతి అందరికి తెలిసిందే. జగన్ మోహన్ ముఖ్యమంత్రి అయినప్పటినుండి ఎదో ఒక విధంగా జగన్ మోహన్ రెడ్డి ని పొగుడుతూనే వుంది. ఇటీవలే జగన్ కి జాగ్రత్తలు చెప్పి హాట్ టాపిక్ అయింది. ఇపుడు జగన్ కి ఎవరైనా అడ్డొస్తే మర్డర్ చేసి జైలుకెళ్లడానికి కూడా వెనకదానంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కి జగన్ సిన్సియర్ గా పని చేస్తున్నారు. దానిని సక్రమంగా చేయనివ్వండి అని సోషల్ మీడియా లో పోస్ట్ తో సంచలనం రేపింది.

మీడియా ని కంట్రోల్ చేయడం తప్పు అంటూనే, దానికి తగు వివరణ ఇచ్చింది. జర్నలిజం నిష్పక్ష పాతం గా ఉండాలని, సొంత పార్టీ లు డబ్బా కొట్టుకున్నట్లు ఆహ, ఓహో అని రాస్తూ, వేరే పార్టీ వాళ్ళని, అవినీతి పరులు, క్రిమినల్స్ అని అనడం తప్పు అని చెప్పింది. ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పై అభిమానం చూపించడం లో శ్రీ రెడ్డి ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. జగన్ నిర్ణయాలతో, సంక్షేమ పథకాలతో ప్రజలు ఇప్పటికే సంతోషం వ్యక్తం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.