జగన్ పాలనపై సుజనా సంచలన కామెంట్స్

SMTV Desk 2019-09-16 11:48:12  

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి గెలిచినా భారీ స్థాయి విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది.దీనితో ఇక ఏపీలో మళ్ళీ రాజన్న పాలన వచ్చేసినట్టే అని జగన్ అభిమానులు మరియు వైసీపీ అభిమానులు భావించారు.కానీ ఇప్పుడు మాత్రం అందుకు పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి.జగన్ అధికారం చెపట్టి వంద రోజులు కావచ్చిన జగన్ ఇచ్చిన మాటలు కానీ ప్రభుత్వం తరపున ప్రజలకు చేరువ కావాల్సిన పథకాల విషయాల్లో కానీ పూర్తి స్థాయి న్యాయం జరగలేదు అన్న మాట వాస్తవం.

దీనిపైనే ఏపీ ప్రజలు సహా ఇతర పార్టీల నేతలు కూడా భిన్నభిప్రాయాలు వ్యక్తం చేసారు.ఇంకా సూటిగా చెప్పాలి అంటే జగన్ ఈ వంద రోజుల పాలన అతను ఏం చేసినా సరే మహా అద్భుతం అని నమ్మే వారికి తప్ప ఎవరికీ నచ్చడం లేదు.ఇదిలా ఉండగా జగన్ 100 రోజుల పాలనపై బీజేపీ కీలక నేత అయినటువంటి సుజనా చౌదరి కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.అయితే ఒక ప్రభుత్వం ఎలా పని చేస్తుందో అన్నది నిర్ణయించడానికి ఖచ్చితంగా 100 రోజులు అయితే సరిపోదు అని..

కానీ ఈ 100 రోజుల్లో మాత్రం ఏపీ ప్రభుత్వం పరిపాలనపై అసలు దృష్టి పెట్టలేదు అన్న విషయాన్నీ ప్రజలు అనుకుంటున్నారని అదే విధంగా తమ భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కూడా ఇదే అని అన్నారు.ఒక పథకాన్ని మార్చాలి లేదా దాన్ని మరింత పురోగతి చెందించాలి అంటే అది ఉన్నప్పుడే చెయ్యాలి కానీ దాన్ని పూర్తిగా ఆపేసి చెయ్యకూడదు అని జగన్ ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తుందని సంచలన కామెంట్స్ చేశారు