దానికి చంద్రబాబు జీవితం మొత్తం సరిపోదు!!

SMTV Desk 2019-09-13 13:07:03  

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు, ఆయన బినామీలు పల్నాడు ప్రాంతాన్ని అక్రమ మైనింగ్ ద్వారా దోచేశారని సాయిరెడ్డి విమర్శించారు. భూములు లాక్కోవడంతో పాటు కోడెల ట్యాక్స్ తో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.

తన రాజకీయ ప్రయోజనాల కోసం హింస, అశాంతిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. లోకేశ్ ట్యాక్స్, కోడెల ట్యాక్స్ బాధితుల కోసం శిబిరాలు ఏర్పాటు చేసే దమ్ము చంద్రబాబుకు లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ధైర్యం చేసి క్యాంపులు ఏర్పాటు చేయాలనుకున్నా, బాధితులకు న్యాయం జేసేందుకు ఆయన జీవితం మొత్తం సరిపోదని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.