పులివెందుల గణేశ్ లడ్డూ వేలం పాట.. రూ. 5,50,116

SMTV Desk 2019-09-09 11:40:40  

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ వినాయక విగ్రహం, చేతిలో ఉంచిన లడ్డూ ధర ఏకంగా ఐదున్నర లక్షలకు పైగా పలికి, రికార్డు సృష్టించిన స్థానిక మైత్రి లే అవుట్‌ లో గణనాధుడి విగ్రహాన్ని కొలువుదీర్చగా, వినాయకుడికి ప్రసాదంగా సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు. ఎర్రబల్లి, కొత్తపల్లెకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మాడెం పుష్పనాథరెడ్డి, దీన్ని రూ. 5,50,116కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి ప్రసాదాన్ని వేలం పాటలో దక్కించుకోవడం తనకు లభించిన అదృష్టమని అన్నారు. ఆధ్యాత్మికపరంగా ఈ ప్రాంతం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.