తెరాస ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్ లో ఒక పెద్ద స్కామ్ ఉంది

SMTV Desk 2019-08-18 14:17:29  

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వంప్రవేశపెట్టినటువంటి ప్రతి స్కీమ్ లో ఒక పెద్ద స్కామ్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్మణ్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కాగా కెసిఆర్ ప్రభుత్వ హయాంలో తెరాస పార్టీ నేతలందరూ కూడా రాష్ట్రాన్ని చాలా వరకు చాలా దారుణంగా రాబందుల్లాగా దోచుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా కరీంనగన్ ప్రాంతంలోని గ్రానైట్ ని సక్రమంగానే దోచుకుంటున్నారని లక్ష్మణ్ అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి విషయాన్నీ పక్కనబెడితే, అవినీతిలో మాత్రం తెలంగాణ రాష్ట్రము దేశంలోనే రెండవ స్తానం లో ఉందని, తెలంగాణ రాష్ట్రం ఇలా తప్పుదారిపట్టడానికి కారణం కేవలం కల్వకుంట్ల కుటుంబమేనని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.

అంతేకాకుండా తెరాస ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా కనిపిస్తున్నది అవినీతి అని, కొత్త సచివాలయం పేరుతొ డబ్బులు దండుకునే బదులు, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు డబ్బు చెల్లింపులు పూర్తిగా చెల్లించవచ్చు కదా అని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. అనవసరమైన పథకాలు పెట్టడం ఎందుకు, చివరికి ప్రజలను మోసం చేయడం ఎందుకని లక్ష్మణ్ తెరాస ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అక్రమానికి కారణం కెసిఆర్ కి సంబందించిన కుట్రే అని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు.