మోదీ, అమిత్ షా లతో జగన్ భేటీ..

SMTV Desk 2019-08-06 11:46:27  

సోమవారం జెరూసలేం పర్యటనను ముగించుకొని భారత్ తిరిగి వచ్చిన ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. తదనంతరం పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలవనున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. పెండింగ్‌లో విభజన సమస్యలు, పోలవరం, విద్యుత్ కొనుగోలు వంటి విషయాల గురించి ప్రధాని మోదీకి వివరించనున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారు. అనంతరం రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును అలానే మధ్యాహ్నం నిర్మలా సీతారామన్‌ను జగన్ కలవనున్నారు.