అక్బరుద్దీన్‌పై కేసు పెట్టండి..: కోర్టు

SMTV Desk 2019-08-01 15:22:50  Akbaruddin,

మత విశ్వాసాలు రెచ్చగొట్టేలా.. హిందువుల మనోభావాలు కించపరిచేలా కామెంట్స్ చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను కరీంనగర్​ జ్యుడిషియల్​ మెజిస్ర్టేట్ ​పి.సాయిసుధ ఆదేశించారు. జులై 24న కరీంనగర్ లో జరిగిన సభలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. దీనిపై కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టుకెక్కారు. ప్రసంగం వీడియో సీడీని జతపరుస్తూ ఫిటిషన్ దాఖలు చేశారు. 2012లో మత విద్వేశాలు సృష్టించేలా చేసిన కామెంట్లపై కేసు ఎదుర్కొంటున్న అక్బర్.. తాజా వ్యాఖ్యలతో విద్వేశాలకు ఆజ్యం పోస్తున్నారని పేర్కొన్నారు.