విలీనానికి సై అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

SMTV Desk 2019-06-06 15:47:22  trs, congress,

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియ ఈ రోజు ఊపందుకుంది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి భవన్‌లో విందు ఇస్తున్నారు. విందు తర్వాత వీరు అసెంబ్లీకి చేరుకుని సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరనున్నారు. గతంలో అసెంబ్లీలో, శాసన మండలిలో టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసినప్పుడు పాటించిన ప్రక్రియనే పాటించనున్నారు.

సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), జాజాల సురేందర్(ఎల్లారెడ్డి), రేగా కాంతారావు(పినపాక), కందాల ఉపేందర్ రెడ్డి(పాలేరు), హరిప్రియ(ఇల్లందు), వనమా వెంకటేశ్వరరావు(కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య(నకిరేకల్), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(ఎల్బీనగర్), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్), హర్షవర్ధన్ రెడ్డి(కొల్లాపూర్), గండ్ర వెంకటరమణారెడ్డి(భూపాలపల్లి), పైలెట్ రోహిత్ రెడ్డి(తాండూరు).

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల గెలించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి నిన్న రాజీనామా చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడం, ఉత్తమ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. శ్రీధర్ బాబు(మంథని), మల్లుభట్టి విక్రమార్క(మధిర), సీతక్క(ములుగు), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(మునుగోడు), జగ్గారెడ్డి(సంగారెడ్డి) మాత్రమే ఉన్నారు.