ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

SMTV Desk 2019-06-06 12:35:34  Utham Kumar, Congress,

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈరోజు సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయన హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, మళ్ళీ లోక్‌సభ ఎన్నికలలో నల్గొండ నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో హుజూర్‌నగర్‌ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని డిల్లీలో జాతీయ రాజకీయాలలో పాల్గొనాలని భావిస్తున్నారు. కనుక త్వరలోనే ఆయన స్థానంలో కొత్త పిసిసి అధ్యక్షుడు నియమితులయ్యే అవకాశం ఉంది.