జూన్ 7వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

SMTV Desk 2019-06-05 15:08:29  Inter advnce exams,

జూన్ 7వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఇంటర్ మొదటి సం.పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సం.పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యం అయినా లోనికి అనుమతించబోమని కనుక విద్యార్దులందరూ ముందుగానే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
బెటర్మెంట్ పరీక్షలు వ్రాస్తున్నవారితో కలిపి మొత్తం 4,63,236 మంది విద్యార్దులు ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాబోతున్నారని అశోక్ తెలిపారు. విద్యార్దులందరికీ పోస్ట్ ద్వారా హాల్ టికెట్లు పంపించామని, ఒకవేళ ఎవరికైనా అందకపోతే ఆందోళన చెందకుండా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. వాటిపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకాలు లేకపోయినా విద్యార్దులను పరీక్షలు వ్రాసేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలకు సంబందించి విద్యార్దులకు ఎటువంటి సమాచారం కావాలన్నా 040–24601010, 040–247 32369 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని అశోక్ తెలిపారు.