స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్న జగన్

SMTV Desk 2019-06-03 15:31:42  jagan,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఏకంగా ఫోన్ చేసి మరీ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్. ప్రమాణ స్వీకారానికి ముందు స్వామికి ఫోన్‌ చేసిన జగన్‌ ఆయన ఆశీస్సులు కోరారు. ఆయన ఆశిస్సులు అందుకున్న తర్వాతే వైఎస్‌ జగన్‌ తన నివాసం నుంచి ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి బయలుదేరారు. ఇక ఆయన మీద అత్యంత విశ్వాసం చూపుతున్న జగన్ ఆయనను ప్రత్యేకంగా కలవనున్నట్టు చెబుతున్నారు. ఈమేరకు ఆయన విశాఖ పర్యటన మంగళవారం ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు విశాఖ చేరుకునే ఆయన, స్వరూపానందను దర్శించుకోనున్నారు. ఆయనతో దర్శన అనతరం భేటీ అయ్యాక తిరిగి అమరావతి చేరుకుంటారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్, ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను దర్శించుకోలేదు అందుకే ఆయన ఇప్పుడు దర్శన కోసం వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఇక జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారట.