దారుణం.....టీడీపీ నేతపై కర్రలు, నాపరాళ్లతో దాడిచేసిన వైసీపీ కార్యకర్తలు

SMTV Desk 2019-06-01 12:39:47  kurnool

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాలలో టీడీపీ నేత శివనారాయణ రెడ్డిపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. నిన్న రాత్రి బైక్ పై ఇంటికి వెళుతుండగా రోడ్డుపై అడ్డగించిన వైసీపీ కార్యకర్తలు.. శివనారాయణ రెడ్డిపై కర్రలతో దాడిచేశారు. ఈ సందర్భంగా కిందపడిపోయిన శివనారాయణ రెడ్డి కాళ్లపై నాపరాళ్లతో కొట్టారు.

అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. అటుగా వెళుతున్న కొందరు స్థానికులు శివనారాయణ రెడ్డిని గమనించి పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివనారాయణ రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు ఇంతవరకూ కేసు నమోదు చేయలేదు.