శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం

SMTV Desk 2019-06-01 12:12:17  Sri lakhmi, Jagan,

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తో భేటీ అయ్యారు. ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలై, అనంతరం నిర్దోషిగా బయటకు వచ్చిన శ్రీలక్ష్మి రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్నారు. నేడు ఆమె ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి, ఏపీలో సేవలు అందించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారని సమాచారం. ఏకంగా ఆమె తాడేపల్లిలోని సీఎం నివాసాని వెళ్లి ఆయనతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యుటేషన్‌పై పనిచేయడానికి అనుమతించాలని కోరుతూ ఆమె ఇప్పటికే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏపీకి చెందిన శ్రీలక్ష్మి 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను తెలంగాణకు కేటాయించగా ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక ఆమె విషయంలో సానుకూలంగానే ఉన్న జగన్ రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.