పెరిగిన మధ్యాహ్న భోజనం ధరలు

SMTV Desk 2019-05-30 19:15:35  afternoon meals hiked

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వచ్చే నెలలో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే సమయం నుంచి పెంచిన ధరలతో భోజనం తయారు చేసి విద్యార్థులకు వడ్డించనున్నారు. మధ్యాహ్న భోజన ధర లు పెంచడంతో జిల్లాలో సుమారుగా 92 వేల మంది పేద విద్యార్థులకు మేలు జరగనుంది. వి ద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకూ లాభం చేకూరనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.


ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్నందుకు ఏజెన్సీకి ఒక విద్యార్థికి ప్రభుత్వం రోజుకు రూ.4.13 పైసలు, 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.6.18 పైసలు చెల్లిస్తోంది. అందులోనే కూరగాయలు, వంట సామగ్రిని ఏజెన్సీ వారే సమకూర్చుకోవాలి. ప్రభుత్వం బియ్యం, వారానికి మూడుసార్లు కోడిగుడ్లును మాత్రం వంట ఏజెన్సీ వారికి అందించేది. ప్రభుత్వం అందిస్తోన్న డబ్బులు కూరగాయలు, పప్పులు, నూనెలు, ఇతర సామగ్రికి సరిపోవడం లేదని వంట చేసే ఏజెన్సీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రోజుకు గతంలో కన్నా 22 పైసలు, 6 నుంచి 10వ తరగతి వారికి 33 పైసల చొప్పున అదనంగా పెంచింది. దీంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వంట చేసి పెడుతున్నందుకు ఏజెన్సీలకు రోజుకు ఒక విద్యార్థికి రూ.4.35 పైసలు, ఉన్నత పాఠశాల వారికి రూ.6.51 పైసలు అందనుంది.