బాబు ఓటమితో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది .. లక్ష్మి పార్వతి సంచలనం

SMTV Desk 2019-05-28 15:28:16  Lakmi parvathi,

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు లక్ష్మీపార్వతి వచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమితో ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని ఆమె అన్నారు. దీంతో అక్కడే ఉన్న చంద్రబాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

ఎన్టీఆర్‌ జయంతి వేడుకలపై లక్ష్మీపార్వతి అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆయన ఘట్‌ను కూడా అలంకరించరా? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. పవిత్ర ప్రదేశంగా భావించాల్సిన టీడీపీ శ్రేణులు ఘాట్‌ను అలంకరించకుండా వదిలేశారన్నారు. ఆ మహానేత ఘాట్‌ వద్ద ఒక్క బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేయరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా.. అల్లుడిగా ఘాట్ వద్ద ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.