కెసిఆర్ తో కలిసి జగన్ ఢిల్లీకి పయనం

SMTV Desk 2019-05-28 15:13:13  KCR, Jagan,

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కెసిఆర్, ఏపీలో జగన్ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు… ఇకపై వారిరువురు కూడా కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు.ఇరు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన పోరాడానికి సిద్ధమయ్యారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… అయితే ఈ నెల 30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు… కాగా ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కానున్నదని సంగతి మనకు తెలిసిందే… కెసిఆర్ తో పాటే ఇతర నాయకులు కూడా హాజరు కానున్నారు…

కాగా జగన్ ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే జగన్, కెసిఆర్ తో కలిసి విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. వీరిరువురు కలిసి ప్రధానిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సాయంత్రం 7 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను మరొకసారి నెరవేర్చాలని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కోరనున్నారని సమాచారం.