తిరుమల స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్

SMTV Desk 2019-05-27 13:31:45  KCR, tirumala,

నిన్న దర్శనార్ధం తిరుమలకు వచ్చిన కేసీఆర్ కు టీటీడీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికి ఈ ఉదయం స్వామివారి దర్శనం చేయించారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మహాద్వారం గుండా లోపలికి వెళ్లిన కేసీఆర్ శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం పలికిన అర్చకులు, కేసీఆర్ కు స్వామివారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందించారు. దర్శనం కోసం నిన్న సాయంత్రమే కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్‌కు వైసీపీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.

ఆపై కాసేపు సేదదీరిన తరువాత, శ్రీవారి పాదాలు, శిలాతోరణం తదితర ప్రాంతాలకు కేసీఆర్, ఆయన వెంట వచ్చిన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ తిరుమలకు రావడం ఇది రెండోసారి.