టీవీ9 రవిప్రకాశ్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

SMTV Desk 2019-05-24 18:00:35  vijayasai reddy, tv9 ex ceo, ravi prakash

సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మెరుగైన సమాజం కోసం’ అని నీతులు చెప్పే రవిప్రకాశ్ గత శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారని విమర్శించారు.

ప్రస్తుతం ఆయన కోసం ఎస్వోటీ పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. ఒకవేళ అమరావతిలో దాక్కుంటే ఈ నెల 23 తర్వాత దొరికిపోతామన్న ఉద్దేశంతో కర్ణాటక మీదుగా ముంబై చేరుకున్నట్లు తనకు తెలసిందన్నారు. తనను ఎవరూ టచ్ చేయలేరని బీరాలు పలికిన ఆయన ప్రస్తుతం పరారీలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం 3 గంటల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడట. సైబరాబాద్ ఎస్వోటి పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళితే 23 తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబై చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?’ అని ట్వీట్ చేశారు.