ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నేడే

SMTV Desk 2019-05-24 16:01:28  kcr

స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలకు జరగనున్న వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు అభ్యర్థుల పేర్లను ప్రకటించరున్నారు కేసీఆర్. ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్...ఈరోజు నల్గొండ అభ్యర్థి ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఓకేసారి ప్రకటించనున్నారు.

అదేవిధంగా రంగారెడ్డి స్థానం నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నల్గొండ నుంచి మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు చర్చకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఆయన ఎమ్మెల్యేల కోటాలోని ఎమ్మెల్సీ స్థానం కోరుతుండడంతో... చిన్నపరెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, చకిలం అనిల్‌కుమార్‌, సుంకరి మల్లేశ్‌గౌడ్‌, వై.వెంకటేశ్వర్ల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే... ఈరోజు నల్గొండపై తుది నిర్ణయం తీసుకొని.. ఆ తర్వాత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించనున్నారు కేసీఆర్.