జగ్గా రెడ్డి తెరాస లో చేరుతారా ?

SMTV Desk 2019-05-10 14:07:29  jagga reddy,

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూడడం హాట్‌టాపిక్‌గా మారింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్‌తో చేతులు కలిపారు. ఆయనతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం గులాబీ గూటికి చేరతారని అప్పుడే ప్రచారం జరిగింది. కానీ జగ్గారెడ్డి మాత్రం ఇప్పటికీ నాన్చుతూనే ఉన్నారు. తాజాగా టీఆర్ఎస్‌లో చేరికపై ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. కేసీఆర్, కేటీఆర్ బంధువులు తనను టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారని చెప్పిన ఆయన ఈ నెల 25 నుంచి 30వ తేదీ లోపు తాను గాంధీభవన్ లో ఉంటానో లేక టీఆర్ఎస్ భవన్ లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉంటుందని ఆయన అనడం చూస్తుంటే అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారో చూసుకుని దుకాణం కట్టేసే యోచనలో ఉన్నట్టు అర్ధమవుతోంది. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయాల్లో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ ఖాయమని జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరతారని పలువురు నేతలు చెబుతున్నారు. ఐతే ఆయన పార్టీ మారబోరని మరికొందరు నేతలు అంటున్నారు. అదే ఏదో తేలాలంటే కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారో తేలాలి.