ఎండ తీవ్రత… తీసుకోవాల్సిన జాగ్రత్తలు

SMTV Desk 2019-05-10 13:02:52  Temparature

ఆరుబయట పనిచేసే వారు, ఉద్యోగస్తులు నేరుగా ఎలాంటి రక్షణ లేకుండా బయట తిరుగద్దని, తరుచూ సరైన ద్రావణాలు తాగుతూ ఉండాలని, బయటకి వెళ్లేటప్పుడు మంచినీరు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
* ఎండలో వెళ్లేటప్పుడు తలపై టోపీగాని, తలపాగ ధరించడం మంచిది.
* ఎండలో కాటన్ దుస్తులు, వదులుగా పలుచగా ఉండే దుస్తులు ధరించడం మంచింది.
* కాఫీలు, టీ లతో పాటు ఎక్కువగా వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
* ఎండ వేడిలో ఎక్కువ సేపు పని చేయకూడదు.
* బయటకి వెళ్లేటప్పుడు గొడుగుగాని, చేతి రుమాలు గాని ఉంచుకోవడం
మంచిది.
* వడదెబ్బకు గురైనట్లు లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.
* వీలైనంతవరకు ఉదయం 10గంటల లోపు పనులు పూర్తి చేసుకోవడం మంచిది.
పై జాగ్రత్తలు పాటిస్తే ఎండ వేడికి కొంత ఉపశమనం కలుగవచ్చు.