ఎన్నికల కౌంటింగ్‌కు శిక్షణ ఇవ్వాల్సిందే: ద్వివేది

SMTV Desk 2019-05-08 11:39:10  gopala krishna dwivedi ias, election commission, datawar

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల కౌంటింగ్‌కు శిక్షణ తప్పనిసరి అని ఆయన తెలిపారు. అంతేకాక ఆర్వోలు, ఏఆర్వోలకు నియోజకవర్గ స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని, కౌంటింగ్‌ సిబ్బందికి 24గంటల ముందు మాత్రమే నియోజకవర్గం కేటాయించాలని ఈసీ సూచించింది. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని ద్వివేది కోరారు. ప్రతి రౌండ్‌లో ఫలితాలు ఏజెంట్‌లకు చూపించి సంతకాలు తీసుకోవాలని, పరిశీలకులకు మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి ఫోన్లు అనుమతించాలని సూచించారు.