నీచ రాజకీయాలు చేయడం కంటే చిప్పలు పట్టుకొని అడుక్కోవడం నయం

SMTV Desk 2019-05-08 11:28:40  Ka Paul

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎపికి సిఎం ఎవరన్నది డిసైడ్ చేసేది తానేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కెఎ పాల్ చెప్పారు. హైదరాబాద్‌ లో మీడియా సమావేశం నిర్వహించిన పాల్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడారు. మే 23న ఎపి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. తాను కెసిఆర్, జగన్‌కు శత్రువును కాదని తెలిపారు.
చంద్రబాబునాయుడికి రిటైర్మెంట్ ఇచ్చి మనిద్దరం ప్రజలకోసం పనిచేద్దామని వైఎస్‌ జగన్‌ ను కెఎ పాల్ కోరారు. ఎపిలో తప్పకుండా ప్రజాశాంతి పార్టీకి 100కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు సర్వే ద్వారా తెలిసిందన్నారు. నీచ రాజకీయాలు చేయడం కంటే చిప్పలు పట్టుకొని అడుక్కోవడం నయం అన్నారు. కెఎ పాల్ నిజాయితీకి మారుపేరని తనకు తానే కితాబిచ్చుకున్నారు. కావాలనే మాకు హెలికాప్టర్ గుర్తును కేటాయించారన్నారు. బాబు ఇప్పటికైనా మనసు మార్చుకుంటారా..? మీ కోసం ప్రేయర్ చేయాలా..? అని పాల్ పేర్కొన్నారు.