అక్షయ తృతీయ: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక బంగారు డాలర్లు

SMTV Desk 2019-05-06 18:47:26  ttd, gold dollars

అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిదని విశ్వసిస్తారు. వారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. ఆలయ సన్నిధిలో బంగారు కొంటే ఇంకా మంచిదన్న ఉద్దేశంతో డాలర్లను తీసుకొస్తోంది. పసిడి, వెండి కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా మరింత సంపద వచ్చి చేరుతుందని భారతీయుల సెంటిమెంట్. అక్షయతృతీయ అయిన మంగళవారం రోజున శ్రీవారి డాలర్లు అమ్మకం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఎదుట డాలర్ల నిల్వలను టీటీడీ అమ్మకానికి ఉంచింది.

ఇప్పటికే శ్రీవారి డాలర్లను అమ్మాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడీ.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. అందుకోసం ఈ నెల ఏడో తేదీ వరకు కొన్ని ధరలను ఖరారు చేసింది..

డాలర్ల రకం రూ.లలో..బంగారం 10 గ్రాములు రూ.32,78బంగారం 5 గ్రాములు రూ.16,311బంగారం 2 గ్రాములు రూ.6,754వెండి 10 గ్రాములు రూ.593వెండి 5 గ్రాములు రూ.320రాగి 10గ్రాములు రూ.26రాగి 5 గ్రాములు రూ.20