సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని మాట .. అయితే ఇక్కడ వైసీపీ అధినేత జగన్ లా ఉన్న ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. జగన్ ప్రసంగాలకు అచ్చం ఆయనలాగే హావభావాలు పలికిస్తూ అదరగొట్టేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే ఓ యాంగిల్ లో అచ్చం జగన్ లా ఉన్న ఇతని పేరు రమేశ్ అని తెలుస్తోంది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరి ఖని ప్రాంతానికి చెందిన ఇతనికి జగన్ అంటే చాలా ఇష్టమనీ, అందుకే జగన్ లా హావభావాలు పలికిస్తూ వీడియో చేస్తుంటాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది