అవెంజర్స్ కు ఫిదా ఐన ప్రముఖ రాజకీయ వేత్త

SMTV Desk 2019-05-03 18:57:47  Avengers end game,

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరిక లేకుండా ఇన్నాళ్లు రాజకీయాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. కాస్త ప్రశాంతత కోసం వైఎస్ జగన్ తాజాగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాకు వెళ్లారు. హాలీవుడ్ సినిమా ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామిని సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలో ఇప్పటికే రూ.250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు వసూళ్లను రాబట్టింది ఎవెంజర్స్ ఎండ్ గేమ్.

కాగా సినిమాకు మంచి పేరు రావడంతో వైఎస్ జగన్ ఏఎంబి సినిమాస్ కు వెళ్లి ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ను తిలకించారు. కొంతమంది పార్టీ నేతలతో కలిసి వెళ్లిన జగన్ హాలీవుడ్ మూవీ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాను చూశారు. గ్రాఫిక్ మాయాజాలంతో నిండిన సినిమాపై జగన్ ప్రశంసల జల్లులు కురిపించారు. అయితే ఇప్పుడు జగన్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.